ఆరోమా థెరఫీ కి నరాలు ,బావోద్రేకాల పై అనుకూల ప్రభావాన్ని చూపేశక్తి ఉంది . ఈ ఆరోమా ఆయిల్స్ రోజువారీ సమస్యల నుంచి బయట పడేసేందుకు అద్భుతంగా పనిచేస్తాయి . మెదడులో ప్రతికూల భావనలు వస్తూ ఆత్మ విశ్వాసం సన్నగిలు తున్నట్లు అనిపిస్తే స్నానం చేసే నీళ్లలో రోజ్ ,శాండిల్ ఉడ్ ఆయిల్స్ కలుపుకొని స్నానం చేస్తే మనసు తేలిక అవుతుంది . తరుచూ మూడ్స్ మారిపోతుంటే లవెండర్ ,యాంగ్ యాంగ్ ,పెప్పర్ మెంట్ లు మంచి మందు . వీటిని గాలిలోని స్ప్రే చేసి పీల్చిన ,స్నానం చేసే నీళ్ళలో కలుపుకొన్నా మంచి ఫలితం ఉంటుంది . రోజ్ మేరీ ,లెమన్ ఆరోమా ఆయిల్స్ టిష్యు మీద వేసి పీల్చితే తాజాదనం  అనిపిస్తుంది . లెవెండర్ ,జెరేనియం ,బెర్గ్ మెట్ ఆయిల్స్ స్నానం చేసే నీళ్ళలో వేస్తే యాంగ్జయిటి తగ్గుతుంది .జెరేనియం ,లెమన్ పెప్పర్ మెంట్, రోజ్ మేరీ లు ఎనర్జీ బుస్టర్ లుగా పనిచేస్తారు . పనిచేసే చోట ఈ ఆయిల్స్ ఒక్క చుక్క వేసిన చుట్టూ వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తుంది .

Leave a comment