చక్కని సువాసన కలిగిన మరువాన్ని మల్లెలతో కలిపి మాలలు అల్లుతారు. మంచి వాసనతోపాటు ఇది చక్కని ఔషధం కూడా. దీని వాసన డిప్రెషన్ ను ,ఆందోళనను తగ్గిస్తుంది. నిద్ర పడుతుంది. అదే సమయంలో రక్త నాళాలు వ్యాకోచించటం వల్ల బిపి తగ్గి గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది.మరువం నుంచి తీసిన తైలం చర్మానికి మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరపు ముడతలను తగ్గిస్తుంది. ఈ మరువపు పొడిని క్రీముల్లో ,లోషన్లు ,సోప్ లో ఎక్కువగా వాడతారు . ఈ తైలాన్ని ఇతర నూనెలతో కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతోంది. దీన్నీ రాత్రి పూట జుట్టుకు రాసి ఉదయాన్నే తల స్నానం చేస్తే ఏ సెంటూ,అత్తరు ఇవ్వనంత సువాసన ఇస్తుంది.

Leave a comment