పంజాబీ యువతి  పరిణీతి చోప్రా తన నటనతో కోట్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టక ముందర 86 కిలోల బరువున్న ఈ అమ్మాయి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ద్వారా కఠినమైన నియమాలతో చూడ చక్కని రూపాన్ని ఎలా సాధించుకుందో సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కి  ఎంతో మంది యువతులు స్పందించారు. తాను  చేసిన వర్కవుట్స్ గురించి పరిణీతి చోప్రా మాట్లాడుతూ  ఫుడ్ లవర్ గా ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాం తనకి కఠిన పరీక్షేనన్నది. ఫాస్ట్ ఫుడ్ ఎంత ఇష్టమైనా నూరు కట్టేసుకున్నాననీ పాలు బ్రౌన్ బ్రెడ్ బటర్  ఎగ్ వైట్ జ్యూస్ గ్రీన్ సలాడ్ బ్రౌన్ రైస్ వెజిటబుల్స్ అదీ చాలా తక్కువ పరిమాణంలో తీసుకున్నానంటోంది. నూనె లేని ఆహారం, తీపి లేని గ్లాసు పాలు చాకొలేట్ షేక్ తోనే  సరిపెట్టుకొన్నా నంది. తర్వాత రొటీన్ గా వెళ్లే జిమ్ తో పాటు కేరళ మార్షల్ ఆర్ట్స్ కలరియా పట్టు కూడా నేర్చుకున్నానంది. ఇది నన్ను మరింత సామర్ధ్యంగా శక్తిమంతంగా తీర్చిదిద్దింది. అంటూ చెప్పుకొచ్చింది పరిణీతి. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసిన వీడియోలకు సందర్సకులు వెల్లువెత్తారు.

Leave a comment