క్రిష్టియన్ డియర్.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పర్ఫ్యూమ్ తయారీ సంస్థ. ఇది ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉంది ఆ కంపెనీ తయారు చేసే జెయడోర్,మిస్ డియర్, లా కలెక్షన్ వంటి పర్ఫ్యూమ్ ల తయారీ కోసం మల్లెపూలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా తమిళనాడులోని మధురై లో బొండుమల్లెలు పూస్తాయి. అవి ఒకటి రెండు వరుసలు కావు మూడు నాలుగు వరుసల్లో బొద్దుగా పూస్తాయి. మామూలు మల్లె పూరేక   కంటే దళసరిగా ఉంటాయి తొందరగా వడలిపోవు రాలిపోవు. రాత్రి ఏ జాము కైనా వాసి వాడ కుండా పాల తెలుపుతో ఘుమా ఘుమా లాడి  పోతూ ఉంటాయి. ఈ గాడత వల్లే ఈ మల్లెలు క్రిష్టియన్ డియర్ వంటి సంస్థల కోసం తరలి వెళుతున్నాయి.1950లో రామేశ్వరం ద్వీపం లోని రైతులు కోయంబత్తూరు వ్యవసాయ క్షేత్రం నుంచి ఈ బొండుమల్లె రకం తెచ్చి తమిళనాడు అన్ని ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. కానీ అవన్నీ మధురై మల్లె పూలంత ఘుమాయించే సువాసన ఇవ్వలేదు ఇక్కడి మట్టి లో సల్ఫర్, పొటాషియం, స్థాయిలు, అలాగే జోన్ జమెన్ అల్ఫా టెర్పినియల్ వంటి ఆల్కలాయిడ్ల శాతం ఎక్కువగా ఉండటంవల్ల మల్లెల కీ ఘాటైన సువాసన వచ్చిందని చెబుతున్నారు. ఈ పరిమళానికి, రూపానికీ ఎవరైనా మనసిచ్చుకోవాల్సిందే.

Leave a comment