మధురై మల్లెపూలను ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఉండే క్రిష్టియన్ డియోర్ పెర్ఫూమ్స్ తయరీ సంస్థ తాము తయారు చేసే జేయడోర్ ,మిస్ డియర్ వంటి ఫెర్పప్యూమ్స్ లో వాడుతుందట. ప్రతి సంవత్సరం జనవరి ,ఫిబ్రవరిల మధ్య ఈ మల్లెపూలను ఫ్రాన్స్ కి దిగుమతి చేసుకొంటారు. మన దేశంలో మొత్తం 80 రకాల మల్లెపూలుజాతులున్నాయి. మధురైలో పూసే మల్లెలు బొండు మల్లెలు . ఇవి మూడు నాలుగు వరస రేకులతో ,తెల్లని పాల తెలుపు తో అధ్భుతమైన పరిమళంతో ఉంటాయి ,కిలో మల్లెల ఖరీదు మూడున్నర వేల రూపాయలు చేస్తాయట. వేసవి కాలపు భానుడి కిరణాల వేడిని కూడా మనసులో పెట్టుకోకుండా పూవుల కోసం ఎదురు చూస్తారంటే ఈ పరిమళం కోసమే కదా.

Leave a comment