రక రకాల ఊరగాయలు నోరూరిస్తూ ఉంటాయి. వీటిల్లో ఉప్పు కారం నూనె అల్లం వెల్లుల్లి ఆవపిండి మెంతిపిండి ఉంటాయి.సాధారణంగా ఆయా కాయల్లో ఉండే పోషక విలువలు మొత్తం కాకపోయినా కొంతయినా ఊరగాయల్లో ఉంటాయి కొద్ది మోతాదులో ఊరగాయ తింటే   వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఉండటమే కాకుండా అవి జీర్ణాశయ ఆరోగ్యానికి కూడా మేలుచేస్తాయి. కాకపోతే ఎక్కువ మొత్తంలో ఉప్పూకారం ఉంటాయి కనుక ఎక్కువ అన్నంలో కలుపుకుని తినాలి వీటిలోని నూనె ద్వారా అధిక కేలరీలు శరీరానికి అంది బరువు పెరగవచ్చు .ఈ ఊరగాయలు ఇష్టమైతే కూరలతో పప్పు తో పెరుగుతో నంజుకుని తింటే అన్నం అధికంగా తినే పని తప్పుతోంది.

Leave a comment