సాధారణంగా గర్భవతిగా ఉంటే వాంతులు వికారం ఉండటం సహజం . నెలలు గడుస్తున్నా కొద్దీ వాటంతట అవే తగ్గుమొహం పడతాయి కానీ ఆ సమయంలో సరైన ఆహారం తీసుకోకపోతే నీరసం వస్తుంది . కడుపులో బిడ్డ ఎదుగుదల బావుండాలి అంటే వివిధ రకాల పండ్లు ఆకుకూరలు పాలు ,పెరుగు తప్పకుండా తీసుకోవాలి . రోజు ఓ పిడికెడు ఆక్రోట్ ,పిస్తా,బాదం పప్పులు తీసుకోవాలి . వైద్యులు సూచించిన మందులు వేసుకోవాలి అలాగే ఉదయం లేచిన వెంటనే వికారం తగ్గాలంటే పరగడుపున అల్లం వేసిన నీరు తాగాలి . నిమ్మ,నారింజ,కమలా,దానిమ్మ వంటి పండు తినటం ,లేదా రసం తాగటం వల్ల వికారం తగ్గుతుంది . ఘాటైన వాసనలు  వచ్చే సొంపులు,సెంట్లు జోలికి వెళ్ళకూడదు . ఆహారం ఒకసారి కాకుండా ప్రతిరెండు గంటల కొకసారి కొద్దికొద్దిగా తీసుకోవాలి . భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు .

Leave a comment