పండ్లు,కూరగాయలతో నిల్వ చేసే పచ్చళ్లలో ఉండే బాక్టీరియా జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు. మామిడి,టమాటో,దోస,అల్లం,చింతపండు వంటి కూరగాయలు పచ్చళ్ళలో వాడే ఆవపిండి,మెంతిపిండి,కారం,ఉప్పు,నువ్వులనూనె వేరుసెనగ నూనె శరీరానికి మేలుచేస్తాయి పచ్చళ్ళలో కొవ్వులు విటమిన్-బి ఖనిజాలు పీచు,యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరం అయ్యె ఇనుము పొటాషియం ఉంటుంది. భోజనంలో ఎన్నో రకాల కూరలు,కొత్త వంటకాలు ఉన్న ఒక్క ఊరగాయ ముక్కఅరుచుల్నిమించి పోతోందనటంలో ఆశ్చర్యం లేదు. అదే పనిగా పచ్చళ్ళు తింటే నష్టమేమో గానీ మరీ తినకుండా భయపడవలసిన అవసరం మాత్రం లేదు.

Leave a comment