పరువు హత్యలపై పోరాటం మొదలుపెట్టి ఏడాదిన్నర పాటు దాన్ని ఒక ఉద్యమంలా నడిపి గెలిచింది కౌసల్య. తమిళనాడుకు చెందిన కౌసల్య ప్రేమించి పెళ్ళి చేసుకున్నా శంకర్ ను ఆమె తల్లిదండ్రులే హత్య చేశారు. ఆమె కూడా తీవ్రంగా గాయపడింది. కోలుకొన్న తర్వాత భర్త మరణం భరించలేక పోయింది. ఎన్నో సార్లు ఆత్మహత్యాప్రయత్నం చేసింది. అత్త మామలు ఆమెకు అండగా నిలబడ్డారు. కౌసల్య ఎంతో కష్టంతో ప్రత్యేక్ష సాక్ష్యాలను సేకరించి పోలీసులకు అప్పగించింది. గత సంవత్సరం కౌసల్య తండ్రితో సహా బంధువులకు న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. కౌసల్య ఇప్పటికీ శాంతంచినట్లే. పరువు హత్యలకు వ్యతిరేఖంగా నాటకాలు వేస్తే సందేశం ఇస్తోంది.

Leave a comment