అర్చన కొచ్చర్ కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్, బాలీవుడ్ లో షారుక్ ఖాన్, ప్రియాంక చోప్రా, అమితాబ్ బచ్చన్, మలైకా అరోరా, కంగనా రనౌత్, లకు ఫ్యాషన్ స్టైలిస్ట్ పర్యావరణ హితమైన ఫ్యాషన్ ను సృష్టించాలని ఆలోచన తో పట్టుపురుగులను హింసించి చంపకుండా పట్టు తీసి ఆ ప్రోడక్ట్ కు అహింస సిల్క్ అని పేరు పెట్టి ప్రమోట్ చేశారు. జార్ఖండ్ లోని గిరిజన స్త్రీల తో పనిచేసి వారికి ఉపాధి అవకాశాలు దొరికేలా చేశారు. అందరూ కలిసి తయారు చేసిన అహింస సిల్క్ డిజైన్లతో న్యూయార్క్ ఫ్యాషన్ షో లో పాల్గొన్నారు. భారతీయ చేనేత కళ నైపుణ్యం సంస్కృతి ప్రతిబింబించేలా పోచంపల్లి, ఇక్కత్, గొల్లభామ, నారాయణపేట చీరలు బంగారు జెర్రీ ముత్యాలతో అవుట్ ఫిట్స్ డిజైన్ చేశారు అర్చన కొచ్చర్.

Leave a comment