బంగారు రంగు పసుపు పచ్చగానే మనకి తెలుసు తర్వాత వైట్ గోల్డ్ రోజ్ రంగుల్లో బంగారు నగలు వచ్చాయి. ఈ రెండు రంగులు వచ్చాక మిగతా వర్ణాలు మాత్రం రాకుండా ఉంటాయా. బంగారంలో రాగి శాతం 20 నుంచి 60 శాతం పెంచితే రోజ్ గోల్డ్ నగలు వచ్చాయి. రాగి శాతాన్ని బట్టి అది గులాబీ ముదురు గులాబీ ఎరుపు నారింజ రంగుల్లోకి మారిపోతుంది. అలాగే 75 శాతం బంగారానికి 23 శాతం వెండి 2 శాతం కాడ్మియం కలిపితే ఆకుపచ్చ బంగారం అది ముదురాకుపచ్చలోకి మారాలంటే 15 శాతం వెండి ,6శాతం కాపర్,4 శాతం కాడ్మియం కలుపుతారు బగారంలో ఐరన్ ,ఇండియం కలిపితే నీలీ రంగు ,అల్యూమినియం కలిపితే ఉదారంగు బంగారం తయారవుతుంది.

Leave a comment