మేలిమి బంగారు నగలు పచ్చగా మెరిసిపోతూ ఉండాలని రూలేం లేదు. హారాలు, నెక్లస్ లు ,వడ్డాణాలు ,గాజులు పెయింట్స్ తో పూసుకోని నీలిరంగు నెమళ్ళు ,ఎర్ర తామర పూవులు ,పచ్చని ఆకులు, తీగలు సహజసిద్దమైన వర్ణాలతో కనువిందు చేస్తున్నాయి. ఎనామిల్ తో నగలపైన చక్కని చిత్రాలు వేస్తున్నారు. బంగారంతోనే కాదు వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు కూడా ఇలా చీరెల మ్యాచింగ్ కు సరిపోయేలా హరివిల్లు వర్ణాలతో కళ్ళని కట్టేసుకొంటున్నాయి. ఇదివరలో ఏదో ఒక చెవిదిద్దుపైన కొన్ని , కొమ్మవరకే కనిపించే ఎనామిల్ పెయింట్స్ ఇప్పుడు పూర్తి నగని సప్తవర్ణ శోభితం చేసేస్తున్నాయి.

Leave a comment