కొన్ని పండ్లే కాదు, వాటి పైన వుండే తొక్కలు ఎంతో మేలు చేస్తాయి. ఆరెంజ్, నిమ్మ తొక్కలు చర్మానికి చేసే మేలు గురించి మనకు తెలుసు. ఇప్పుడు బొప్పాయి పై తొక్కలు పారేయకండి. ఆ పై తోలుతో చర్మం కాంతివంతంగా తాజాగా అయిపోతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పండు ఎర్రర్రగా నిగనిగలాడుతూ నొరూరించి నట్లే పై తోలులో వుండే ఎంజైములు చర్మాన్ని సూర్య రశ్మి నుంచి కాపాడి వయస్సు రిత్యా ఏర్పడిన మచ్చల్ని తొలగిస్తాయి. ముఖం శుభ్రంగా కడుక్కుని బొప్పాయి చర్మం లోపలి భాగం తో మొహం పై మసాజ్ చేసుకోవాలి. కళ్ళ చుట్టూ గల ఫైన్ లైన్స్ పై చక్కగా రుద్దాలి. మెడ చేతులకు పట్టించి పది నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది.

Leave a comment