Categories
Wahrevaa

పసుపులో ౩౦౦ యాంటీ ఆక్సిడెంట్స్.

ఇప్పు ప్రతి కురగాయాల్లో, దినుసుల్లో, పండ్లలో యాంటీ అక్సిడెంట్స్ వున్నాయని చెప్పుతుంటారు. ఎన్నో అనారొగ్యాల బారి నుంచి కాపాడుకోవడానికి చర్మ సౌందర్యానికి ఇవి అవసరం. పసుపులో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ దాదాపు మూడు వందల వరకు ఉన్నాయి. ఎన్నో వేల సంవత్సరాలుగా భారతీయిలు సౌందర్య సాధనంగా, ఆరోగ్య ప్రధాయినిగా ఉపయోగిస్తున్న పసుపు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కుడా ఉపయోగిస్తున్న పసుపును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో అంతర్గత బాహ్య ప్రయోజనాలు దక్కుతున్నాయి. పసుపులో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువే. వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే జలుబు, దగ్గు, సైనస్ నుంచి మంచి ఉపసమనం కలుగుతుంది. శరీరంలో చక్కని రోగనిరోధక వ్యవస్థ ఏర్పడేందుకు పసుపు దోహద పడుతుంది.

Leave a comment