ఏది ఫ్యాషన్, ఏడి అందం, ఏది ట్రెండ్ అంటే చెప్పడం కష్టం ఇప్పుడు కావాల్సింది న్యూ లుక్ ఎవ్వరూ చేయని పని చేసి పది మందిలో ప్రత్యేకంగా వుండాలి. ట్రెండ్ సెట్టర్ అనిపించుకోవాలి.  ఇన్ స్టాగ్రామ్ లో ఫేస్ బుక్ లో లైకులు కురవాలి. సెల్ఫీల్లో ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించాలి. బొమ్మలు, పూలు, పండ్లు, చీరలు, చుక్కలు డిజైన్లు పోయి దుస్తుల పై ఇప్పుడు ఫుడ్ ప్రింట్స్ యువతను ఆకర్షిస్తుంది. లాంగ్ గౌన్లు చుక్కలు, టీ షర్టుల పై పిజ్జా, లస్సి, స్ట్రా వుండే కూల్ డ్రింక్, ఇలా ఎన్నో రకాల ఆహార పదార్ధాలు ప్రింట్లు వస్తున్నాయి. ఇవి అందంగా దుస్తులకు అదనపు ఆకర్షణ గా కంపిస్తున్నాయి. 2017 లో వస్తున్న ఈ ఫుడ్ ప్రింట్స్ ఇప్పుడు ఇవ్వాల్టికి ఫ్యాషన్ డిజైనర్లు కనిపెట్టిన గొప్ప ఆలోచన కనే కాదు. 1937 లో దుస్తుల పై ఆహారపు ప్రింట్లు వుండే దుస్తులు తయ్యారు చేసారు. ఆ పాత ట్రెండ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఈ ఫుడ్ ప్రింట్స్ మార్కెట్లో బెస్ట్ ఫ్యాషన్ డ్రెస్ అనచ్చు.

Leave a comment