జుట్టు ఆరోగ్యంగా , తెల్లబడి పోకుండా ఉండాలంటే ఇంట్లో చేసిన ఈ మిశ్రమం వల్ల మంచి ఫలితాం ఉంటుంది. జుట్టు పొడిబారనివ్వదు కూడా. గోరింటాకు పోడిలో ఎండిన అరటి పండు , పుల్ల మజ్జిగ బాగా కలిపి ఉంచితే నానిపోయి మెత్తగా అవుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఓ అరగంట తర్వాత స్నానం చేస్తే ఇది జుట్టును ఆరోగ్యంగా పెంచేందుకు సహకరిస్తుంది. జుట్టు పొడి భారి పోకుండా పట్టులా మెరుస్తూ ఉంటుంది. ఈ ఎండలకు ఇది చాలా చక్కగా ఉపయోగపడే హెయిర్ ప్యాక్ . ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవు. ఇలాంటి సహజమైన పద్దతులు చర్మానికి జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.

Leave a comment