ఈ వేసవి ఎండలకు జుట్టు పొడిబారి పోతుంది.జీవం లేకుండా గడ్డిలా అయిపోతూ ఉంటుంది. కొన్ని చిన్న చిట్కాలతో ఎలాంటి రసాయనాలున్న ముందులు వాడకుండా జుట్టు పట్టులా మెరిసేలా చేయచ్చు. కొబ్బరి పాలు అవకాడొ మిశ్రమం జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి పాలు అవకొడాను గుజ్జులా అయ్యేలా చేసి దానికి తేనే నిమ్మరసం కలిపి జట్టుకు పట్టిస్తే జుట్టు జీవం పుంజుకుంటుంది. అలాగే అరటి పండ్లు ,ఆలీవ్ నూనె తేనె మిశ్రమం కూడా జుట్టును పట్టులా చేస్తుంది. ఈ విశ్రమంలో లవెండర్ లేదా రోజ్ మెరీ నూనె కలిపినా మంచిదే. అలాగే గుడ్డు పచ్చ పొన తెనే కొబ్బరి నూనె కలిపి తయారు చేసిన హెయిర్ మాస్క్ తో జుట్టు పట్టుకుచ్చులా అయిపోతుంది. ఈ విశ్రమాన్ని వెంట్రుకలకు పట్టించి ఓ అరగంట ఆగాక తల స్నానం చేస్తే సరిపోతుంది. ఇవన్ని ఎలాంటి రసాయనాలు కలవనివి కనుక జుట్టు ఎండతో ఆరోగ్యంగా ఉంటుంది కూడా.

Leave a comment