వేల ఖరీదు పెట్టుకొన్న పట్టుచీర సాధారణంగా రోజుకట్టుకోలేం అలాగని ఏళ్ల తరబడి పెట్టెల్లో పెట్టేస్తే ఉపయోగంలో లేకుండా పోవచ్చు. ముఖ్యంగా పదిసార్లు కట్టాక ఇంక ఎప్పుడూ ఇదేనా అనిపిస్తుంది. దాన్ని ఇంకేం చేస్తాం అనుకుంటే ఇలా చేసి చూడచ్చు. పట్టు చీర అంచులు చాలా బావుంటాయి. అమ్మాయిల డ్రెస్ లకు ఈ అంచులో ఎంతో అందం ఇస్తాయి. ఫ్యాషన్ లుక్ కూడా ఇస్తాయి. స్కర్ట్ కు ముందువైపు చీర కుండే అందమైనకొంగు అటాచ్ చేయచ్చు. పట్టు చేరాలన్నీ భారీగా వుండే కొంగులే ఉంటాయి కనుక అనార్కలీ గౌన్  వంటివి డిజైన్ చేయచ్చు. అలాగే అంచు తినేసాక చీర చాలా అందంగా మన్నికగా మెరుపులో నిండిన క్లాత్ లాగా ఆయిపోతుంది. దానిపై బ్లాక్ ప్రింట్ వేసి మంచి ఎంబ్రాయిడరీ చేయించి చక్కని డ్రెస్ లు కుటించుకోవచ్చు. ఇంకా మిగిలిన జరీ సాదా పట్టు క్లాత్ తో అందమైం హ్యాండ్ బాగ్స్ సెల్ ఫోన్ పీచ్ లు పెద్ద బ్యాగ్ లు కుట్టించవచ్చు. అందమైన చీర కనుక దానిలో ఎలాంటి ఎక్సపెరిమెంట్లు చేసినా  బాగానే ఉంటాయి.

Leave a comment