ఇప్పుడు సిల్క్ దారాలతో వస్తున్నా గాజులు చెవి రింగులు హారాలు పెద్ద ఫ్యాషన్. అసలివి ఇళ్లల్లో చేసుకునే విధంగా పెరల్స్ తో చేసిన చెయిన్లు స్టోన్ చెయిన్లు  మీటర్ల లెక్కన దొరుకుతాయి. అలాగే ఫ్లవర్ బీడ్స్ మల్టీ కలర్ పట్టు దారాలు దొరుకుతున్నాయి. సంప్రదాయ  వస్త్రాలంకరణ లో భాగంగా ఇప్పుడు సిల్క్ గాజులు ఫ్యాషన్. అందమైన గాజులు కర్ణాభరణాలు హారాలు పూర్తి  మ్యాచింగ్ కిట్స్ లో కూడా దొరుకుతున్నాయి. ప్లాస్టిక్ మెటల్ వెడల్పాటి గాజుకు సిల్క్ దారాన్ని నైపుణ్యంతో చుట్టేసి ఆ దారం చుట్టిన గాజుకు అందమైన పూసలు స్టోన్ పీసెస్ అంటించటం అయితే ఇవి నైపుణ్యం వున్న చేతుల్లోనే తయారైతేనే బావుంటాయి. సంప్రదాయ  ఫంక్షన్లు కోలాటం లాంటి ఆటలు సంక్రాంతి బతుకమ్మ పండుగల సందర్భంలో ఆడపిల్లలు రంగుల దుస్తులు ధరించి ఈ పట్టు గాజులు నగలు వేసుకుంటే వేసుకున్న దుస్తులకు సరైన మ్యాచింగ్ గా ఉంటాయి. ముత్యాలు మెరిసే పూసలు పట్టు దారాల అల్లికతో సిల్క్ గాజులు కొన్ని వాండ్ల రకాలు ఆన్ లైన్ లో కనువిందుగా చూడచ్చు. ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలు కూడా వున్నాయి. ముత్యాల వరసలు స్టోన్ టెయిన్లు  తెచ్చుకుని మనమే గాజులకు అతికించుకోవచ్చు.

Leave a comment