పండుగలంటే పట్టు చీరెలే. ఏ వేడుకలైన అందం చక్కని చీరలే. కంచి ,ధర్మవరం ,నారాయణపేట, పోచంపల్లిగద్వాల్ ,బెనారస్ ,భాగల్ పురి ఎన్నో పట్టు చీరెలు, గద్వాల్ ధర్మవరం ,ఉప్పాడ భాగల్ పురి అసోం,పైథాన్ కాస్త తెలిగ్గా ఉంటాయి . జరీలు లేకుండా చక్కని గళ్ళ చీరెలు కావాలనుకొంటే నారాయణ్ పేట ఇంక గొల్లభామ చీరెలు చాలా అందంగా ఉంటాయి. బెనారస్ కంచి భాగల్ పురి కాస్త ఆడంబరంగా ఉంటాయి. ఎరుపు ,ఆకుపచ్చ, పుసుపు వంటి రంగు పట్టు చీరెల్లోనే పండుగకళ అంతా ఉట్టిపడుతోంది. కాలం మారిన ఎన్నొ కొత్త రకాలు వచ్చిన పట్టు చీరెల ప్రత్యేక మాత్రం ఎప్పటికీ తగ్గదు.

Leave a comment