అనాధ విద్య కోసం కృషి చేస్తున్న పౌలోమి పావిని శుక్లా పేరు ఈ సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ లో చోటుచేసుకుంది 28 సంవత్సరాల సుప్రీంకోర్టు న్యాయవాది  పావని శుక్ల తన సోదరి తో కలిసి వీకెస్ట్ ఆన్ ఎర్త్ ఆర్ఫాన్స్ ఆఫ్ ఇండియా అన్నపేరుతో పుస్తకం రాసింది అదే ఏడాది లక్నో లో అడల్ట్ ఏ అనాధాశ్రమం ప్రారంభించింది. ఈ ఆశ్రమం నిర్వహణకు స్థానిక కంపెనీల మద్దతు తీసుకుంది. నగరంలోని పాఠశాలల్లో నిరు పేద పిల్లలకు అనాధ పిల్లలకు స్టేషనరీ పుస్తకాలు ట్యూషన్ ఫీజు లు ఇచ్చింది. విద్యార్థులకు అవసరమైన కోచింగ్ ట్యూషన్ల్ ల కోసం ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ తో కలసి కీలక పాత్ర పోషించింది. లాక్ డౌన్ లో అన్ని అనాధశ్రమాల్లో స్మార్ట్ టివి లు ఏర్పాటు చేయటం తో పిల్లలకు ఆన్ లైన్ విద్యా సౌకర్యం ఏర్పడింది.

Leave a comment