Categories

ది ఇన్నోవేషన్ స్టోరీ టి ఐ ఎస్ నెలకొల్పి వెనుకబడిన వర్గాల పిల్లలకు సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ బోధిస్తున్నారు 53 ఏళ్ల మీనాల్ మజుందార్ బ్యాంక్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మీనాల్ మజుందార్ పేదరికం లో ఉన్న పిల్లలకు సాంకేతిక విద్య బోధన అందించాలనే కోరికతో ఉద్యోగం మానేసి 2021 లో టి ఐ ఎస్ స్థాపించింది. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల పిల్లలకు ఏఐ రోబోటిక్స్ వెబ్ డెవలప్మెంట్ వంటివి ఉచితంగా నేర్పుతోంది. ఇప్పటివరకు పదివేల మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. చదువు అయిన వెంటనే పేద పిల్లలకు ఉపాధి అవకాశాలు ఉండేలా చూడటం నా లక్ష్యం అంటారు మీనాల్ మజుందార్.