టాటూల ఫ్యాషన్ పూటకొకటి కొత్తది వస్తుంది. ఇదివరకు ఛాతీ పైన, బుజాల పైన వేసుకునే టాటూలు ఇప్పుడు కళ్ళపైన చేవులపైన, పెదవులపైన ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ ఫ్యాషన్ లకు వేదిక సోషల్ మీడియానే, ఇన్ స్టాగ్రాములో సందడి చేసే ఈ టెంపరరీ టాటూల్లో కంటి పైన చిన్న గులాబీ పువ్వు చెవి చుట్టూ అల్లుకున్న తీగలు పెదవుల పైన విరిసిన పువ్వులు ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్. ఇవి షేర్ చేసిన వెంటనే లైక్స్, కామెంట్లు వస్తుంటే ఇక యువత ఊరుకుంటారా? పైగా ఇవి చేరిపితే పోయే టెంపరరీ టాటూలు. ఇంకేముంది నవ్వే పెదవులపై పువ్వులు పూయిస్తున్నారు మెరిసే కళ్ళ పైన ఎగిరే పక్షుల్ని సృస్తిస్తున్నారు. ఈ టెంపరరీ టాటూల్ని ఒక సారి చూడండి కొత్త ఐడియాలు వస్తాయి.

Leave a comment