ముఖం పైన మచ్చలు గీతలు ఉంటే పచ్చి బంగాళదుంపను పలచగా తరిగి ముఖం మీద పరిచినట్లు పదినిమిషాలు ఉంచాలి ఇలా రోజు చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. జిడ్డు చర్మం గలవాళ్లు నాలుగైదు బాదం గింజలను రాత్రి నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ గా చేయాలి ఈ పేస్ట్ లో ఆ అరస్పూన్ తేనె కలిపి ముఖానికి మాస్క్ లాగా వేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది. పెదవులు పగలకుండా ఉండాలంటే గులాబీ రేకులకు కొంచెం పాలు పోసి మెత్తగా చేసి ఆ మిశ్రమాన్ని పెదవులపై అప్లయ్ చేసి కాసేపాగి  శుభ్రంగా కడిగేయాలి అలా చేస్తే పెదవులు పగలవు. మెత్తగా మెరుస్తూ ఉంటాయి.

Leave a comment