ఇద్దరు హీరోయిన్ లు వున్న సినిమాలే చేస్తుంది కెథరిన్ థ్రేసా ఈ విషయం గురించి అడిగితే అలాంటి పాత్రలు చేయాలని ప్లాన్ ఏమీ లేదు కానీ అలాంటి పాత్రలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. కథ చెప్తారు నచ్చితే ఓకే అనేస్తాను,అంతేగానీ అది సెకండ్ హీరోయినా ఫస్ట్ హీరోయినా అని ఎప్పుడు చూడను. చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకొన్నాను. ఎంతో కష్టమైన స్టెప్ అయానా కొద్దీ పాటి ప్రాక్టీస్ తో చేయగలను. ఉస్మానియా యూనివర్సిటీ లెక్చరర్ వద్ద తెలుగు ట్యూషన్ చెప్పించుకుంటున్నాను. తెలుగు భాష పైన కాస్త పట్టు వచ్చాకనే గౌతంనందా లో డబ్బింగ్ చేప్పేందుకు దైర్యం చేశాను. చాలా సమయాల్లో అమెరికన్ సీరియల్స్ చూడటం ,నా పెంపుడు కుక్కలతో ఆడుకోవటం ,ఇష్టమైనవి తింటా అంటోంది కేథరిన్.

Leave a comment