నీహారికా,

పెళ్లయిన మూడేల్లలోగానే చాలా సంబంధాలు విచ్చిన్నమౌతున్నాయని ఒక రిపోర్ట్ వచ్చింది. విశ్లేషకులు మాత్రం కేవలం ఆదిపత్య ధోరణి వల్లనే కలహాలు రేగుతున్నాయంటున్నారు. కొంత మంది ఇల్లల్లో ఇప్పటికే పురుషాదిక్యతే. ఆలు మగలు కలసి పని చేస్తూ పిల్లల పెంపకం, ఇంటి పనులు ఆడవాళ్లే చేయాలన్న ఆలోచనతోనే పురుషులు ఉంటారు.  మగవాళ్ళు డబ్బు వ్యవహారాలూ చూడాలనే ధోరణి కూడా కుటుంబాల విచ్చిన్నం కావడం లో మొదటి కారణంగా చెప్తున్నారు. ఇద్దరికీ తరచూ బంధుమిత్రులను ట్రీట్ చేసే విషయంలో గొడవలు పెరుగుతున్నాయంటున్నారు. ఆలాగే చాల సందార్భాల్లో ఇరువైపులా ఉండే పెద్ద వాళ్ళ జోక్యం, గొడవలకు ఆజ్యం పోస్తుంది. అందువల్ల కొత్తగా పెళ్లయినా యువ దంపతుల మధ్యకు తల్లిదండ్రులు అస్సలు వెళ్లకూడదని, వాళ్ళ కాపురంలో వేలుపెట్టవద్దనీ హెచ్చరికలున్నాయి. ఆలాగే ఇద్దరూ సంపాదన పరులైతే అన్నింటిలో సమానత్వం పాటిస్తూనే, సహనంతో ఆలోచించుకొనే ప్రయత్నం చేయమని పెద్దలు సలహా ఇస్తున్నారు.

Leave a comment