Categories

నిరక్షరాస్యులైన వయోధికులకు చదువు నేర్పిస్తున్నారు బీనా కలాథియా. 50 నుంచి 80 ఏళ్ల వయసు వాళ్ళు ఇప్పటికే కొన్ని వందల మంది ఆమె దగ్గర చదవడం, రాయడం నేర్చుకున్నారు. సూరత్ కు చెందిన బీనా, సీనియర్ సిటిజన్స్ సెంటర్ లో బడి నడుపుతోంది. మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు వరకు ఇక్కడ స్కూల్ నడుస్తుంది. ఉదయం నుంచి తన అక్కాచెల్లెళ్లతో కలిసి వ్యాపారం చేసుకునే బీనా సాయంత్రం స్కూల్ టీచర్ అయిపోతుంది. జీవితానుభవం తో పండిపోయిన వాళ్లకు నాలుగు అక్షరాలు నేర్పించడం లో తనకు సంతోషం ఉంది అంటుంది బీనా కలాథియా.