పిల్లలు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలంటే వాళ్ళకు పెద్దలే రోల్ మోడల్స్ గా వుండాలంటున్నారు ఎక్స్ పార్ట్స్. నట్స్ తాజా పండ్లు, కూరగాయలతో స్మార్ట్ స్టాకింగ్ పెట్టుకోవాలి. వంట చేసే సమయంలో, పోషక పదార్దాల షాపింగ్ లో వారిని భాగస్వాముల్ని చేస్తుండాలి. బయట తింటుందా ఆరోగ్యవంతమైన ఆప్షన్ లు వెత్తుకోవాలి. అలాగే వారికోసం మంచి తీరు తిండ్లు ఇవ్వాలి. అదే సమయంలో వారు సరైన ఆహారం తీసుకునేలా కుడా చూడాలి. పోషకాల గురిచి మంచి ఆహారం గురించి పిల్లల్ని ఎడ్వకేట్ చేయాలి. పాలు పండ్ల రసాలు ఇవ్వాలి కానీ ఆహారం తీసుకుంటూ టీ.వి చూడటం మాత్రం అంగీకరించకుడదు. ఈ అలవాటు వల్ల ఎక్కువ ఆహారం గానీ అస్సలు సరిగ్గా తినకపోవడం గానీ జరుగుతుంది. ఎందుకంటే పిల్లల దృష్టి టి.వి పైనే కేంద్రీకరించి వుంటుంది కనుక సరిగా  ఆహారం తిసుకోలేకపోతారు.

Leave a comment