పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లలకు అంత తేలికగా కోవిడ్ సోకె అవకాశాలు లేవు. అయినా పిల్లల సంరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి అంటున్నారు వైద్య నిపుణులు .తప్పని సరిగా చేతులు శుభ్రం చేసుకోవటం అలవాటు చేయాలి. తద్వారా వైరస్ సోకాదని అర్ధం అయ్యేలా చెప్పాలి. పిల్లలకు చేతులు శుభ్రం చేసుకొనే విషయంలో తల్లిదండ్రులే ఆదర్శంగా ఉండాలి. ఇంట్లో ఎక్కువ సమయం ఇంట్లో ఉంటున్నారు కనుక చిన్న వ్యాయామాలు డాన్స్ లు వంటి యాక్టివిటీ చేయించాలి దీనివల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల ప్రవర్తనలో మార్పు వత్తిడి లక్షణాలు ఉన్నాయేమో గమనించి వాళ్లకు పెద్దవాళ్ళ అవసరం ఏమైనా ఉందా అని విషయం తెచ్చుకోవాలి.

Leave a comment