కాస్త శ్రద్ద పెడితే ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. దీనివల్ల పాదాలు ఆరోగ్యం బావుంటుంది.పగుళ్ళు పోతాయి. ఒక టబ్ నీళ్ళలో ఎసెన్షియల్ ఆయిల్ కాస్త షాంపూ గులాబీ బంతిపూల పొడివేసి అందులో పాదాలను ఓ అరగంట నాననివ్వాలి. తర్వాత ప్యూమిస్ రాయితో కాళ్ళను రుద్దితే మృతకణాలు పోతాయి. పంచదార,తేనె,శనగ పిండి మిశ్రమం పాదాలకు పట్టించి నూనె రాసుకున్న చేతులతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. తర్వాత నీళ్ళలో కడిగేస్తే సరి. పాదాలు చక్కగా మురికి లేకుండా మృదువుగా కనిపిస్తాయి. గోళ్ళు కత్తిరించుకుని చివరగా మాయిశ్చరైజర్ రాయాలి. కనీసం వారానికి ఒక రోజు ఇలా చేస్తే చాలు ఈ పెడిక్యూర్ బ్యూటీ క్లినిక్ లలో చేసే పెడిక్యూర్ ఫలితం ఇస్తుంది.

Leave a comment