ఈ కార్తీక మాసం పెళ్ళిళ్ళు సీజన్ కూడా . పెళ్ళి కూతురి నగల విషయంలో పూర్తి బంగారంతో చేసిన నగలు కొనాలి అనుకొంటే ప్లెయిన్ గోల్డెన్ నక్షి నగలు ఎంచుకోండి అంటున్నారు నిపుణులు . ఇవి పూర్తి బంగారంతో అరుదైన పనితనంతో నిండి ఉంటాయి . దేవత మూర్తులు పువ్వులు,లతలు జంతువులు ఇలా ఎన్ని రకాలైనా వట్టి బంగారంతోనే తయారు చేస్తారు . యాంటిక్ లుక్ లో ఉంటాయి కనుక ఈ తరం అమ్మాయిల తప్పని సరిగా ఇష్టపడతారు . ఈ ప్లెయిన్ నక్షి నగల్లో పాపిడి బిళ్ళ ,వడ్డాణం,ఇయర్ రింగ్స్ కూడా చక్కగా ఉంటాయి . వడ్డాణంలో చెక్కిన లక్ష్మీదేవి ఏనుగు విగ్రహాలు చాలా బావుంటాయి .

Leave a comment