మామూలుగా హాల్లో ఎక్కువ దీపాలతో వెలిగే షాండ్లియర్స్ కనబడుతాయి. వరసలుగా దీపాలతో వెండి ,బంగారు రంగు మెటల్ వర్క్ డిజైన్లతో షాండ్లియర్స్ చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడీ డిజైన్లని దృష్టిలో ఉంచుకొని పెళ్ళి పందిళ్ళను పూల షాండ్లియర్స తో అలంకరిస్తున్నారు డిజైనర్లు. కమలాలు ,తామరలు, చామంతి ,మల్లె ,గులాబీలతో వెడ్డింగ్ ప్లానర్లు పూల వేదికలతో పాటు పూల షాండ్లియర్స్ తో కళ్యాణ వేడుకలను సహజసౌరభాలతో నింపేస్తున్నారు. ఒక్క పెళ్ళి పందిళ్ళే చిన్నచిన్న అకేషన్లు కూడా ఈ పూల అలంకారాలతో కనువిందు చేస్తున్నాయి.

Leave a comment