పోస్టల్ శాఖ తాజాగా పెళ్లికూతుళ్ళ బొమ్మలతో ప్రత్యేక పోస్టల్ స్టాంప్ లు విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల లోని వివాహ సంప్రదాయాలు యావత్ దేశానికి చాటి చెప్పాలని ఉద్దేశ్యం తో పోస్టల్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. పెళ్లి కూతురి కట్టు బొట్టు ఆభరణాలు ఇతర అలంకారణాలతో ఆ సంప్రదాయం ఏ రాష్ట్రానికి సంబంధించినదో స్టాంప్ పైన ముద్రించింది. పంజాబ్, తమిళనాడు, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కేరళ రాష్ట్రాల స్టాంప్ లు ఇప్పుడు విడుదలయ్యాయి మిగతా రాష్ట్రాల స్టాంపులు రానున్నాయి.

Leave a comment