పెంపుడు జంతువులతో చక్కని ఆరోగ్యం సొంతం చేసుకోమంటున్నారు నిపుణులు. ఇంటా బయటా సమస్యలతో మూడ్స్ మారిపోతుంటాయి అలంటి బ్యాడ్ మూడ్ లో పెంపుడు జంతువుల సహచర్యం ఎంతగానో సేదదీరుస్తుంది అంటున్నారు. అది ఆక్వేరియం లో చేపలు కావచ్చు, కుక్క, పిల్లి, రామచిలుక ఏదైనా సరే. రక్తపోటును తగ్గించి గుండెకు సాంత్వన కలిగిస్తాయంటున్నారు. పెంపుడు జంతువులతో గడపటం ఒక్కటే డిప్రెషన్ కు మందు. ఉత్సాహం, ఉల్లాసం వచ్చి చేరతాయని నిపుణుల సూచన. ఉదయాన్నే పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేస్తే చుట్టూ స్నేహితులు లేరని, ఉద్యోగం తర్వాత ఒంటరిగా అయ్యమనే భావన దూరం అవుతుందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు ఎక్కడో దూరంగా ఉండటం, వాళ్ళ ప్రేమ అభిమానానికి దూరం అయ్యామని తల్లిదండ్రులు భావించడం సహజం. ఇంట్లో ఒకటి, రెండు పెంపుడు జంతువులు వుంటే మనసు నిండిన భావన వుంటుందిట. కేవలం ప్రేమను మాత్రం పంచగలిగిన ఈ జంతువుల మధ్యన గడపడం మిగతా విచారాలను దూరం చేస్తుందట. అచ్చం పిల్లల్లాగా యజమాని వవెంటే ఉంటూ, తిరుగుతూ, కాళ్ళకు అడ్డం పడుతూ, తోడుగా ఉంటూ ఇవి మనిషికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
Categories
WoW

పెంపుడు జంతువులు తోడుంటే చాలు

Leave a comment