గుడ్డు కంటే గొప్ప పోషకాహారం ఉండదు కదా. ప్రతి వాళ్ళు గుడ్డు తినాలి అనే చెప్తాం.  ఇప్పుడు విచిత్రమైన అధ్యయనపు రిపోర్ట్ వచ్చింది.  గుడ్డు పెంకులో అత్యధిక కాల్షియం ఉందట.  గుడ్డు సొన తీసేసుకోని పెంకు పారేస్తాం కదా ఇప్పుడీ పెంకు చాలా బెస్ట్ అంటున్నారు.  ఒక గుడ్డు పెంకులో వెయ్యి నుంచి 1500 మిల్లిగ్రాముల కాల్షియం దోరుకుతోందట. ఎముకలు, దంతాల గట్టిదనం కోసం కాల్షియం అత్యవసరం కదా ఇంత పెద్డ మొత్తంలో కాల్షియం దోరుకుతోన్నప్పుడు ఈ గడ్డు పెంకు మెత్తగా పొడి చేసి ,నీళ్లలో కలిపి తాగేయమంటున్నారు.  చెప్పేందుకు ,వినేందుకు భాగుంది కానీ మరీ ఈ పెంకుని తాగడం ఎంత వరకు ఆచరిస్తారో చూడాలి.

Leave a comment