ఉద్యోగం,చదువులతో అమ్మాయిలు ఒంటరిగా ప్రయాణం చేయటం తప్పని సరి అవుతోంది . ఆలా వంటరిగా వెళుతుంటే ఎలాటి ప్రమాదాలు ఎదురవుతాయో ఊహించలేము . అందుకే బయటకు వెళుతుంటే పెప్పర్ స్ప్రేవెంట తీసుకుపోండి . ఈ బాటిల్ చేతిలో ఉంటె ఎవరైనా దడి చేస్తే వాళ్లకు చుక్కలు చూపించవచ్చు . ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు . కాస్త బరకగా దంచిన కారం ,మిరియాల పొడి ,నూనె ,వెనిగర్ తీసుకొంటే చాలు . కారం ,మిరియాల పొడి ,వెనిగర్ ఒక బౌల్ తీసుకోని భాగ్ కలపాలి . మిశ్రమం ఎంతో కాలం నిల్వ ఉండేందుకు వెనిగర్ ఉపయోగ పడుతుంది . అందులో కాస్త నూనెపోసి బాగా కలిపి ,స్ప్రే బాటిల్ లో పోసుకొని దాన్ని బ్యాగ్ లో పాడేసుకొంటే సరిపోతుంది ఎవరైనా వేధిస్తే ఈ  స్ప్రేబాటిల్ మూత తీసి స్ప్రే చేస్తే సరి .

Leave a comment