బాగా చదువుకొని ,చక్కగా సెటిల్ అయినా వ్యక్తిని ,స్వేచ్ఛగా తన అభిప్రాయాలు వెల్లడి చేసేవాడిని ,తమకు సామాజిక,ఆర్థిక భద్రతను ఇవ్వగలిగిన వ్యక్తులను స్త్రీలు ఇష్టపడతారని ఒక తాజా సర్వే తన రిపోర్టును బయటపెట్టింది. ఫర్ ఫెక్ట్ భర్త ఎలాంటి గుణాలతో ఉండాలో కూడా ఈ సర్వే ఒక లిస్ట్ ఇచ్చేసింది. భార్యతో క్యాలిటీ సమయం గడపాలి. ఇక్కడ క్యాంటిటీ కంటే క్యాలిటీ ముఖ్యం. చురుకైన శ్రోతంగా ,భార్య పట్ల ప్రేమను,ఆధరణను చూపించాలి. అరవటం ,పరుష పదజాలం వదిలేసి వాస్తవిక దృక్పథంతో చిక్కులు విడదీసుకొగలగాలి. వ్యక్తిగత,వృత్తిగత ,సామాజిక ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఉంటే భార్యపట్ల ఎంతో కేరింగ్ గా ఉండాలి. భార్య కుటుంబానికి ,తన కుటుంబానికి మధ్య పక్షపాతం వద్దు ,భార్య ఎప్పుడు ప్రత్యేకంగా ఫీలయ్యేలా,భాందవ్యాన్ని సజీవంగా ధృడంగా ఉంచుకోవాలి.

Leave a comment