తీర్చి దిద్దినట్లు కొలతలతో వంపులతో అందరికీ శరీరాలు వుండవు. చక్కగా ఆరోగ్యంగా వుంటారు, మంచి వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఆహారం తీసుకుంటారు కనుక ఎద్లెటిక్ బాడీ తో ఫిట్ గా వుంటారు చాలా మంది అమ్మాయిలు. సాధారణంగా అమ్మాయిలందరికీ ఇండియన్ వేర్ బావుంటాయి. సల్వార్ లేదా పాటియాలా కాలర్డ్ కుర్తీలు హుందాతనం ఇస్తాయి. చుడీదార్ పైజామాలతో  ఫిట్టేడ్ కుర్తీలు చక్కగా నప్పుతాయి. ఇక చీర కట్టు విషయం ప్రత్యేకించి ఇలా కడితే అన్నమాట వదిలేసి వివిధ రాష్ట్రాల చీర కట్టు విధానాలను ట్రై చేయచ్చు. ఇప్పుడు వచ్చే పట్టు జార్జేట్, ప్రింటెడ్ సారీస్ అన్నీ వివిధ రకాల చీర కట్టుకు అనుకూలంగా ఉంటాయి. ఎక్కడ ముడతలు లేకుండా నీట గా వున్నా ఏ కాటన్ చీరయినా చక్కగా కడితే ఏ అమ్మాయి కయినా బావుంటుంది.

Leave a comment