బెస్ట్ షాపింగ్ చేసేందుకు ఒక వయస్సు రావాలంటున్నారు ఎక్స్ పార్ట్స్ సాధారణంగా 25 నుంచి 30 ఏళ్ల వయస్సులో వున్న వాళ్ళకి తమకి ఏవి అవసరమో ఏవినప్పుతాయో తెలియదు. ఇతరులు కొన్నారని, సినిమా తారలు కట్టుకొన్నారని తాము షాపింగ్ చేస్తారు. అవి తమకు నప్పుతాయినే అనుకొంటారు. తీరా షాపింగ్ అయ్యాక అవి నచ్చకుండా పోతాయి. చాలా వస్తువులు నిరుపయోగంగానే ఉంటాయి. అందుకే 50 ఏళ్ళు దాటాక ఒక పరిణితి అనుభవం వస్తుంది. డబ్బు విలువ తెలుస్తుంది. అప్పుడు చేసే షాపింగ్ పర్ ఫెక్ట్ గా వుంటుంది. బాగా నచ్చితేనే కొనడం, నాన్యత గురించి ఆలోచించడం, వస్తువు అవసరం అయితేనే ఖరీదు చేయడం అలవాటు అవ్వుతుంది. షాపింగ్ నేర్పుగా చేసే వయస్సు అదే.

Leave a comment