పెరిగిన బరువు తగ్గుతున్న

 

బరువు పెరిగేప్పుడు ఇష్టమైనవి తింటూనే ఎలా ఎంజాయ్ చేస్తామో బరువు తగ్గేనప్పుడు అంత కష్ట పడవలసి ఉంటుంది.పెరిగిన బరువు ఇలా తగ్గుతున్న అంటూ తన వర్క్ వుట్స్ గురించి సోషల్ మీడియాలో వరస పోస్ట్ లు పెడుతోంది కంగనారనౌత్. ‘తలైవి’ గా జయలలిత బయోపిక్ లో నటిస్తున్న ఆమె ఆ పాత్రకోసం 20 కిలోలు పెరిగిందట.ఇప్పుడా బరువును తగ్గించుకోవటం వర్క్ వుట్స్ చేస్తోంది. కావాలని బరువు పెరిగేందుకు నటీమణులు సాధారణంగా ముందుకు రారు.కొందరే ఆయా పాత్రల్లో ఒదిగిపోయేందుకు ఎంత సాహసానికైనా వెనుదిరగారు సమంత యుద్ధ కళలు నేర్చుకున్నట్లు కంగనా కూడా తన శరీరాకృతిని చక్కగా ఉంచుకునేందుకు చురుకుదనం ఫ్లెక్సిబిలిటీ కోసం వేకువ జామున నిద్ర నడక జాగింగ్ చేస్తా అంటోంది కంగనా.