Categories
ఒక కొత్త ఎమోజీ నెట్ లో కనిపిస్తోంది. ఒక బ్లడ్ డ్రాప్ ,వెనక బ్యాక్ డ్రాప్ లేత నీలం రంగు . ఈ రక్త బిందువు పీరియడ్ ఎమోజీ . ఫ్యాడ్ డేస్ లో ఉన్నానని ఫోన్ లో సంకేతం పంపేందుకు ఉపయోగపడే ఒక కొత్త గుర్తు . ఇది మార్చిలో లాంచ్ అవుతోంది. ఇక తరువాత మార్కెట్లోకి వచ్చే ఫోన్ ఇమేజీల్లో ఈ బ్లడ్ డ్రాప్ ఎమోజీ ఉంటుంది. మహిళలు ఈ విషయం సిగ్గుపడకుండా ఏ ఆఫీస్ కో నేను రాలేనని చెప్పేందుకు పీరియడ్ ఎమోజీ వాడుకోవచ్చు. నెలసరిని ఇక నిత్య జీవితసరళిలో భాగంగా చేసేందుకు బ్రిటన్ ,యూఎస్ నిపుణులు దీన్ని తయారు చేశారు.