నెలసరి సమయంలో చాలా మందికి అలసట,నీరసం పొత్తికడుపు నొప్పి నొప్పి వంటివి విసిగిస్తాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వీటి నుంచి ఉపశమనం అనిపిస్తుంది .నీళ్ళు బాగా తాగాలి పుచ్చ కర్బుజా,కీరా దానిమ్మ,వంటివి తీసుకొంటే డీహైడ్రేషన్ సమస్య ఉండదు రక్త హీనతను నివారించేందుకు ఆకు కూరలు  శనగలు,రాజ్మా బొబ్బర్లు అలసందలు వంటివి ప్రతి రోజు ఆహారంలో తీసుకొంటే నెలసరి సమయంలో నీరసం వంటి సమస్యలు పోతాయి. ఆహారం ఉండే ఇనుమును శోషించు కొనేందుకు విటమిన్ -సి చాలా అవసరం అన్ని రకాల పండ్లు నిమ్మరసం పచ్చి కాప్సికమ్ ,ప్రోటాన్లు ఎక్కువగా వుండే చికెన్,చేప,గుడ్లు,పప్పులు సోయా గింజలు పనీర్ మీల్ మేకర్ ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

Leave a comment