Categories
ఎండ వేడికి చర్మం కమిలినట్లు అయిపోతుంది. దాన్ని తిరిగి ఆరోగ్యంగా ,పూర్వపు స్థితికి తెచ్చెందుకు పెరుగు,పాలు,ఆలీవ్ నూనె, తేనె వంటివి చక్కుగా ఉయోగపడతాయి. పెరుగు,తేనె కలిసి ముఖానికి మాస్క్ లో వేసుకొని , ఆరిన తర్వాత వేడి నీళ్ళతో కడిగేస్తే బాగుంటుంది. అదే మిశ్రమంతో ముఖానికి మర్ధన చేస్తే చర్మం తేమగా , మృదువుగా ఉంటుంది. రాత్రి వేళ ఆలివ్ నూనెతో చర్మానికి మర్ధన చేస్తే ప్రయోజనం ఉంటుంది. తేనె సహాజమైన మాయిశ్చరైజర్. స్నానానికి ముందు తేనె అప్లై చేసి బాగా మర్ధన చేయాలి. ఇలా రెండు రోజుల కొకసారి మర్ధన చేస్తే ఫలితం కనిపిస్తుంది. పాలలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమెటరీ గుణాలు చర్మానికి తేమను అందిస్తాయి. చల్లని పాలతో మొహంపైన రాస్తే బాగా కన్పిస్తుంది.