Categories
WhatsApp

ఫోన్ చాటింగ్ తో కంటికి ప్రమాదం.

జీవన శైలి మారిపోతున్నప్పుడల్లా కొత్త కొత్త జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది. ఇంతకూ ముందు ఫోన్ వాడకంలోకి వచ్చినప్పుడు అది కంమునికేషన్ కోసం మాత్రమే ఎక్కువసేపు మాట్లాడవద్దు చెవులు దెబ్బతింటాయని సలహా ఇవ్వడంతో సరిపోయేది. ఇప్పుడు ఫోన్ చాటింగ్, మెసేజస్ అందులోను ఫేస్ బుక్ అప్లోడ్స్ ఇలా ఎన్నో ఆప్షన్ లు వచ్చాయి. రాత్రి వేళ పడుకుని చీకట్లో మాట్లాడుతూనే వుండటం, చాటింగ్ చేయడం తో నిద్రలేమితో పాటు కంటి చూపు దెబ్బతినే ప్రమాదం వుందని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. రాత్రి పడుకునే ముందర కూడా ఫోన్లో మాట్లాడటం, మెయిల్స్ చెక్ చేసుకోవడం వల్ల గాడ నిద్ర పట్టదని, దగ్గర్గ్ చూడటం వల్ల ఆ ప్రభావం కంటి రెటినా పై పడుతుందని చెప్పుతున్నారు. ఫోన్ ను పడుడుకునే బెడ్ కి దూరంగా కప్ బోర్డ్ లో వుంచి నిద్రకు వుపక్రమించాలని, పగలంతా పడిన కష్టం నిద్ర తో తీరాలని లేకుంటే ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవ్వుతాయనిహెచ్చరిస్తున్నారు.

Leave a comment