గంటల కొద్దీ ఫోన్ లో మాట్లాడుతుంటే ,తల ఒక వైపుకి వాల్చి ఉండటంతో మెడ కండరాలపై భారం పడి ఆ ఒత్తిడి వెన్నుపై పడి సమస్య ఎదురవుతోంది. అందుకే ఫోన్ కూడా రెండు వైపులా మార్చి మాట్లాడాలి. లేదా ఫోన్ వినియోగం కాస్త తగ్గించాలి. కొన్ని రకాల పోషకాలు లేమి కూడా మెడ నొప్పులకు కారణం కావచ్చు. ఎముకల ఆరోగ్యానికి కాల్షియంతో పాటు విటమిన్ డీ కూడా తీసుకోవాలి. అలాగే బరువు పెరిగిన కూడా ఆ భారం వెన్నుపై పడి నొప్పి అనిపించవచ్చు. మెడ కండరాల నొప్పులు వస్తే దాన్ని గురించి డాక్టర్ను కలుసుకొని కారణాన్ని తెలుసుకొంటే మంచిది.

Leave a comment