బంగారు నగల్లో, బొమ్మల డిజైన్ ల లో వస్తున్న కిడ్ కలెక్షన్స్ చూసారా. పండ్లు, పువ్వులు, కార్టూన్ బొమ్మలతో చెవిపోగులు, ఉంగరాలు, లాకెట్లు బంగారు నగల్లో పొదిగి వాటిపైన ఫుంకిగా కనిపించే ఎనామిల్ రంగుల్ని అద్దటంతో అవి పిల్లలకు సరిగ్గా నప్పుతాయి. సాధారణంగా ఇలాంటి ఫుంకీ నగలు పిల్లలకు నచ్చుతాయి. కానీ వన్ గ్రామ్ గోల్డ్ లేదా పూసలతో, ప్లాస్టిక్ తో చేస్తే తమ పిల్లలకు వేసి ఆనందించే పెద్దవాళ్ళకు నచ్చవు. అందుకే ఈ బంగారు నగలు పేరున్న బంగారునగల దుకాణాల్లో కనువిందు చేస్తున్నాయి. కొత్త సంవత్సరం పాపాయికు గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ నగల వైపు చూడండి. బుల్లి బుల్లి బొమ్మల బ్రేస్ లెట్లు, హ్యాండ్ బ్యాండ్స్ కూడా వుంది. ఇవి పిల్లల మోడ్రన్ డ్రేస్సుల పైకి చాలా బావుంటాయి.

Leave a comment