Categories
టెడెక్స్ స్పీకర్, బ్లాగర్ రిచా సింగ్ బ్లాగర్స్, ఇన్ ఫ్లూయన్స్ లను ఒక వేదిక పైకి తెచ్చేలా 2016 లో బ్లాగ్ చాటర్ ప్రారంభించింది.టీనేజర్లు చూసే ఆన్ లైన్ కంటెంట్ ను కాస్త పెద్దవాళ్ల అదుపులోకి తెచ్చేలాగా 2022 లో హాపీ నెట్జ్ ప్రారంభించింది రిచా. ఈ పరికరం ఏ ఐ మిషిన్ లెర్నింగ్ సాయంతో నాలుగు దశల్లో సైట్ ను వడ పోస్తుంది. పెద్దవాళ్ల ఫోన్ కు కనెక్ట్ అయి ఉంటుంది కనుక పిల్లలు ఏ కొత్త యాప్ చూడాలనుకున్న పెద్ద వాళ్ళ అనుమతి కోరుతుంది ఈ యాప్. ఈ పరికరం 11 కోట్లకు పైగా వెబ్ సైట్ లను మానిటర్ చేస్తుంది.