బాల సాహిత్యం మనకు చాలానే ఉంది కాని కాని అవన్ని చాలా మటుకు పెద్దవాళ్ళ కోసం పెద్దవాళ్ళు రాసినట్లు వుంటుంది. మరి నీతి కథలతో పిల్లలకు బోర్ కొట్టేలా ఉంటుంది. అనిల్ బత్తుల రష్యన్ జానపద కథలు అనువాదం చేశాడు. ప్రసిద్దులైన రచయితలు టాల్ స్టాయ్ ,గోర్కి,పుస్కిన్ వంటి వాళ్ళు పిల్లల కోసం రాసిన కథలున్నాయి. పెద్ద అక్షరాల ప్రింట్ తో చక్కని బొమ్మలతో పిల్లలు చదువుకునేందుకు వీలుగా ఉన్నాయి. అనువాదం తేలికైన చక్కని తెలుగు భాషలో బావుంది. పిల్లలకు కానుకగా ఇవ్వదగ్గ పుస్తకం ఇది. ఏ పుట్టిన రోజుకో చక్కని మార్కులు తెచ్చుకుంటేను కానుకగా ఇలాంటి పుస్తకం చేతిలో పెడితే పిల్లలు సంతోషిస్తారు. కథా ప్రపంచం కిరణ్ ను ఈ పుస్తకం గురించి ఫోన్ చేసి 9553518568 అడగవచ్చు.

Leave a comment