ఇంట్లో వండినవి పిల్లలకు నచ్చటం లేదు. ఏం చేసిన బోర్ అంటారు చాలా మంది తల్లులు. కాలం వేగంగా మారుతుంది. ఆ కాలానికి తగ్గట్లు పిల్లలతో పాటు తల్లులు మారాలి. ఇప్పుడు టీవీల్లో ప్రతి రోజు ప్రతి చానల్ లో వంటల ప్రోగ్రాంలు వస్తూంటాయి. ఎక్స్ పర్ట్స్ వండుతారు.వెంటనే ఆ గిన్నెలు, పెనాలు అవతలపెట్టి ఆ ఆహారాన్ని అందంగా డెకరేట్ చేసి మరి చూపెడతారు,కూరగాయలతో పువ్వులు,పక్షులు తయారు చేసి ఆహార పదార్ధాల పైన అలంకరణ కోసం పెట్టి ఇస్తారు. మనం ఇంట్లో చేసే పదార్ధాలే జ్యూస్ ల తయారీ ఫుడ్ కార్వింగ్ పైన ఎక్కడో ఒక చోట గ్లాసులు పెడతారు. లేదా నెట్ లో వందలాది వీడియోలు కనిపిస్తాయి. అది మాములు దిబ్బరొట్టె కూడా ఫిజ్జా మాదిరి తయారు చేసే ట్రిక్స్ నేర్చుకుంటే తప్పేముంది. మనం ప్రేమించే పిల్లల కోసం ఈ మాత్రం నేర్చుకోలేమా?

Leave a comment