పిల్లలకు నాలుగైదు ఏళ్ళు రాగానే వారి తెలివి తేటల గురించి తెలుసుకొనేందుకు ఐక్యూ పరీక్ష పెట్టమని సైకాలజిస్ట్ లు చెపుతుంటారు. ఐక్యూ అంటే ఇంటలిజెంట్ కోషంట్ .ఒక స్థిరీకరించిన పద్దతిలో పిల్లల తెలివి తేటలను సంఖ్యా రూపంలో విలువ కట్టడం .. ఏ సామార్ధ్యాల గురించి పరీక్షిస్తున్నారు, ఎలాంటి పరీక్ష పెడుతున్నారు అన్నా విషయంపైన ఇచ్చే రేటింగ్ ఆధారపడి ఉంటుంది. 90-110 మధ్య రేటింగ్ ఉంటే వారికి మామూలు తెలివి తేటలు ఉన్నట్లు చెప్పవచ్చు. 90కంటే తక్కువ ఉంటే తక్కువ తెలివి తేటలు ఉన్నట్లు 110 కంటే ఎక్కవ లేదా 130 కంటే పైనుంటే వారిని గొప్ప తెలివి తేటలు గలవారిగా అనుకోవచ్చు. పిల్లల్లో ఉండే శక్తి సామార్థ్యాలు ఎలా ఉన్నయో వాళ్ళ పైన మనం ఎంత భారం పెట్టవచ్చో తెలుసుకోవాలంటే ఐక్యూ టెస్ట్ కోసం వెళ్ళచ్చు.

Leave a comment